ఆర్టీసీకి షాకిచ్చిన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు !

అవును ఇప్పుడు దాకా ప్రయాణికులకు బస్సులు అందుబాటులోకి తేకుండా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు షాక్ ఇస్తే, ఇప్పుడు ఆర్టీసీకి షాక్ ఇస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల నుంచి బస్సులు తిరగటం లేదన్న సంగతి తెలిసిందే. దీంతో తాత్కాలికంగా బోర్డర్ వద్ద బస్సులు ఏర్పాటు చేశాయి రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు.

అయితే ఈరోజు ఏపీ తెలంగాణ బోర్డర్ వద్ద అసలు ప్రయాణికులు కనిపించ లేదు. తెలంగాణ నుంచి వచ్చే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ గరికపాడు చెక్పోస్ట్ వద్ద కొన్ని బస్సులు ఏర్పాటు చేసింది. కానీ అసలు గరికపాడు చెక్పోస్ట్ వద్ద ప్రయాణికుల జాడే కనపడ లేదు, దీంతో ఉదయం నుంచి ఎదురు చూసి వెరీ చెక్పోస్ట్ నుంచి ఆరు బస్సులని డిపోలకు పంపించి వేశారు అధికారులు. ప్రయాణికుల రద్దీ లేకపోవడంతోనే వెనక్కు పంపామని అధికారులు చెబుతున్నారు.