లంచం తీసుకుంటూ చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ అధికారి జగ జ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రూ.15 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించినట్లు తెలిపారు. జ్యోతి ఇంట్లో 65 లక్షల రూపాయల నగదుతో పాటు.. 4 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.రేపు ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇంకా వ్యవసాయ భూములు, ప్లాట్లు ఉన్నాయని తెలుస్తోంది.
అంతకుముందు అధికారులు ఆమెను రిమాండ్ తరలించేందుకు సిద్ధం చేయగా ఛాతి నొప్పంటూ ఏసీబీ అధికారులకు జ్యోతి చుక్కలు చూపించింది. దీంతో హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అన్ని రకాల పరీక్షలు నిర్వహించగా నార్మల్ రావడంతో కోర్టుకు తరలించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్లీ…. గుండెనొప్పి అంటూ చెప్పడంతో గుండె పరీక్షలు నిర్వహించారు.మొత్తానికి ఇదంతా నాటకము అని బయటపడటంతో ఆమెను అరెస్ట్ చేసి.. 14 రోజుల రిమాండ్ కు తరలించారు.