మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం గతేడాది నవంబర్ లో ఇటలీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఇటలీలో పెళ్లి జరగడానికి గల కారణాలను వరుణ్ తేజ్ తాజాగా వెల్లడించారు. ‘నా కుటుంబం చాలా పెద్దది. ఇక్కడ వివాహం జరిగితే వేడుకను వాళ్లు పూర్తిగా ఆస్వాదించలేదు. అందుకే ఇటలీలో వివాహం చేసుకోవాలని నిర్ణయించాం. కేవలం 100 మందినే ఆహ్వానించాం. కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా గడిపారు’ అని తెలిపారు.
ఇదిలా ఉంటే…కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’.ఈ చిత్రంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్, మానుషీ జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్నారు.ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.