గుడ్ న్యూస్‌.. కోవ్యాక్సిన్ ఫేజ్ 1 ట్ర‌య‌ల్స్ మొద‌టి పార్ట్ పూర్త‌యింది..!

క‌రోనా కార‌ణంగా తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్న వారికి భార‌త్ బ‌యోటెక్ ఫార్మా కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ కంపెనీ దేశంలో ఇప్ప‌టికే త‌న కోవ్యాక్సిన్‌కు గాను ఫేజ్ 1 క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దేశంలోని మొత్తం 12 ఇనిస్టిట్యూట్ల‌లో ఆ వ్యాక్సిన్‌కు ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నారు. అయితే జూలై 17న రోహ్‌త‌క్ పీజీ ఇనిస్టిట్యూట్‌లో ప్రారంభించిన వ్యాక్సిన్ ఫేజ్ 1 ట్ర‌య‌ల్స్ మొద‌టి పార్ట్ తాజాగా పూర్త‌యింది. ఈ మేర‌కు వ్యాక్సిన్ ట్ర‌య‌ల్ టీం ప‌రిశీల‌కురాలు డాక్ట‌ర్ స‌వితా వ‌ర్మ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

covaxin phase 1 clinical trials first part completed

రోహ్‌త‌క్ పీజీ ఇనిస్టిట్యూట్‌లో కోవ్యాక్సిన్‌కు గాను మొత్తం 6 మందికి టీకాలు ఇచ్చారు. వారికి గాను మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్ మొద‌టి పార్టు పూర్త‌యింది. రెండో పార్టు‌లో వారిని ప‌ర్య‌వేక్షించ‌నున్నారు. దీంతో కొద్ది రోజుల‌కు మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్‌లో రెండు పార్టులూ ముగిసి ఫ‌లితాలు వ‌స్తాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎలాంటి తీవ్ర‌మైన సైడ్ ఎఫెక్ట్స్ ఎదురు కాలేదు. ఈ క్ర‌మంలో మెడిసిన్ స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ని సైంటిస్టులు ఆశాభావం వ్య‌క్తం చేశారు.

కాగా మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్‌లో మొత్తం 50 మందికి దేశ‌వ్యాప్తంగా టీకాలు వేశారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ స‌త్ఫ‌లితాల‌ను ఇచ్చింద‌ని సైంటిస్టులు తెలిపారు.