కోవాగ్జిన్ అత్యవస వినియోగంపై సందిగ్థం కొనసాగుతోంది. తాజాగా నేడు మరోసారి WHO సాంకేతిక సలహా కమిటీ కోవాగ్జిన్ అత్యవస అనుమతులపై భేటీ కానుంది. భారత దేశానికి చెందిన హైదరాబాద్ బెస్డ్ భారత్ బయోటిక్ రూపొందిన కోవాగ్జిన్ అత్యవసర అనుమతుల విషయమై WHO సాంకేతిక సలహా కమిటీ అక్టోబర్ 26న భేటీ అవుతున్నట్లు ఆసంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ట్విట్టర్ లో తెలిపారు. గతంలో కోవాగ్జిన్ అత్యవసర అనుమతుల విషయంపై మరింత సమచారం కావాలని WHO కోరింది. ప్రస్తుతం WHO అత్యవసర అనుమతులను ఇస్తే ప్రపంచం వ్యాప్తంగా కొవాగ్జిన్ వాడకానికి అనుమతి లభించినట్లు అవుతుంది.
కోవాగ్జిన్ భవితవ్యం తేలేది నేడే.. అత్యవసర వినియోగంపై WHO కీలక భేటీ.
-