కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (18-08-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో మంగ‌ళ‌‌వారం (18-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

1. దేశంలో కొత్త‌గా 55,079 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 27,02,743కు చేరుకుంది. 6,73,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 19,77,780 మంది కోలుకున్నారు. 51,797 మంది చనిపోయారు.

2. తెలంగాణ‌లో కొత్త‌గా 1682 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 93,937కు చేరుకుంది. 72,202 మంది కోలుకున్నారు. 21,024 మంది చికిత్స పొందుతున్నారు. 711 మంది చ‌నిపోయారు.

3. క‌రోనా వైర‌స్‌ను ఉత్ప‌త్తి చేసి అందించేందుకు గాను కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని 5 ఫార్మా కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. సీరం ఇనిస్టిట్యూట్‌, భార‌త్ బ‌యోటెక్‌, జైడ‌స్ కాడిలాతోపాటు మ‌రో 2 కంపెనీల‌తో కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు చ‌ర్చిస్తున్నారు.

4. ఏపీలో కొత్త‌గా 9,652 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,06,261కు చేరుకుంది. 85,130 మంది చికిత్స పొందుతున్నారు. 2,18,311 మంది కోలుకున్నారు. 2,820 మంది చనిపోయారు.

5. దేశంలో క‌రోనా మ‌ర‌ణాల శాతం 2 కంటే త‌క్కువ‌గా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ తెలిపారు. కొత్త‌గా 9 ల‌క్ష‌ల ప‌రీక్ష‌లు చేశామ‌న్నారు. మొత్తం 25 శాతం వ‌ర‌కు యాక్టివ్ కేసులు ఉన్నాయ‌న్నారు.

6. త‌మిళ‌నాడులో కొత్త‌గా 5,709 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,49,654కు చేరుకుంది. మొత్తం 6007 మంది చ‌నిపోయారు. 2,95,794 మంది కోలుకున్నారు. 53,820 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

7. ప్ర‌పంచంలో చైనా త‌రువాత ప్ర‌స్తుతం మ‌న దేశంలోనే నిత్యం ఎక్కువ‌గా పీపీఈ కిట్లు త‌యార‌వుతున్నాయి. రోజుకు 5 ల‌క్ష‌ల పీపీఈ కిట్ల‌ను త‌యారు చేస్తున్నారు. వీటిని అమెరికా, బ్రిట‌న్ దేశాల‌కు కూడా విక్ర‌యిస్తున్నారు.

8. త‌మిళ‌నాడులోని మ‌ధురై జిల్లాలో నివాసం ఉండే యాచ‌కుడు పూల్ పాండియ‌న్ ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.90వేలు విరాళం ఇచ్చాడు. మే 18న అత‌ను రూ.10వేల‌ను విరాళంగా అందించాడు. త‌రువాత 8 సార్లు రూ.80వేలు మొత్తం క‌లిపి రూ.90వేల‌ను అందించాడు. దీంతో అత‌న్ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అభినందించి అవార్డును అంద‌జేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

9. మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 11,119 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,15,477కు చేరుకుంది. 20,687 మంది చ‌నిపోయారు. 1,56,608 మంది చికిత్స పొందుతున్నారు. 4,37,870 మంది కోలుకున్నారు.

10. ఓ వైపు క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతుంటే వ‌ర్షాకాలం సీజ‌న్ వ‌ల్ల క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌ల‌లో స్వైన్ ఫ్లూ కూడా విజృంభిస్తోంది. జూలై 31వ తేదీ వ‌ర‌కు క‌ర్ణాట‌క‌లో మొత్తం 458 స్వైన్ ఫ్లూ కేసులు న‌మోద‌య్యాయి. తెలంగాణ‌లో 443 వ‌ర‌కు కేసులు న‌మోద‌య్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version