కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (31-07-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో శుక్ర‌‌‌‌‌‌వారం (31-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

1. ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 10,376 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,40,933కు చేరుకుంది. 74,720 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 63,864 మంది కోలుకున్నారు. 1349 మంది చ‌నిపోయారు.

2. గది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఉన్న నీటిలో క‌రోనా వైర‌స్ 24 గంట‌ల్లో 90 శాతం వ‌ర‌కు న‌శిస్తుంద‌ని సైంటిస్టులు తేల్చారు. 72 గంట‌ల్లో వైర‌స్ పూర్తిగా న‌శిస్తుంద‌న్నారు. స‌ముద్ర‌పు జ‌లాలు, తాజా నీటిలో క‌రోనా వైర‌స్ వృద్ధి చెంద‌లేద‌న్నారు. మ‌రుగుతున్న నీటిలో అయితే క‌రోనా వైర‌స్ వెంట‌నే న‌శిస్తుంద‌ని తెలిపారు.

3. ఏపీలో ప్లాస్మా దానానికి ముందుకు వ‌చ్చే వారికి రూ.5వేలు ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. ప్లాస్మా థెరపీపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్లాస్మా థెర‌పీపై విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌న్నారు. సెప్టెంబ‌ర్ 5 నుంచి పాఠ‌శాల‌ల‌ను తెరిచేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నామ‌ని సీఎం తెలిపారు.

4. క‌రోనాకు మ‌నిషిని చంపే శ‌క్తి లేద‌ని తెలంగాణ ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. కేవ‌లం రూ.1వేయి ఖ‌ర్చుతో క‌రోనా త‌గ్గుతుంద‌ని అన్నారు. ఖ‌మ్మం జిల్లా హాస్పిట‌ల్‌లో కొత్త‌గా ఏర్పాటు చేసిన ట్రూ నాట్ టెస్ట్ సెంట‌ర్‌ను ఆయ‌న ప్రారంభించారు.

5. పెద్ద‌ల‌తో పోలిస్తే 5 సంవ‌త్స‌రాల క‌న్నా త‌క్కువ వ‌య‌స్సు ఉండే పిల్ల‌ల ముక్కుల్లోనే కరోనా వైర‌స్ క‌ణాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు తేల్చారు. పెద్ద‌ల క‌న్నా 10 నుంచి 100 రెట్ల వైర‌స్ చిన్నారుల ముక్కులోనే ఉంటుంద‌న్నారు. అయితే అది పెద్ద‌ల‌కు వ్యాప్తి చెందుతుందా, లేదా అన్న విష‌యాన్ని తేల్చాల్సి ఉంద‌న్నారు.

6. దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 55,079 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క రోజులోనే 779 మంది చ‌నిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 16 ల‌క్ష‌లు దాటింది. 5,45,318 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 10,57,806 మంది కోలుకున్నారు. 35,747 మంది చ‌నిపోయారు.

7. తెలంగాణ‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1986 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క రోజులోనే 14 మంది చ‌నిపోయారు. మొత్తం 16, 796 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 519 మంది చ‌నిపోయారు.

8. అత్య‌వ‌స‌ర స్థితిలో ఉన్న క‌రోనా పేషెంట్ల‌ను కాపాడేందుకు దాత‌లు ప్లాస్మాను దానం చేయాల‌ని సినీ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ పిలుపునిచ్చాడు. కరోనా నుంచి కోలుకుని ప్లాస్మాను దానం చేసిన ప‌లువురు దాత‌ల‌ను విజ‌య్ ఈ సంద‌ర్బంగా ప్ర‌శంసించాడు. ప్లాస్మా దానం చేయ‌డం వ‌ల్ల అత్య‌వ‌స‌ర స్థితిలో ఉన్న క‌రోనా రోగుల‌కు ప్రాణాపాయం త‌ప్పుతుంద‌ని, వారి ప్రాణాల‌ను కాపాడిన వార‌మ‌వుతామ‌ని అన్నాడు.

9. క‌రోనా నేప‌థ్యంలో ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను నిషేధిస్తున్న‌ట్లు డీజీసీఏ తెలిపింది. అంత‌కు ముందు జూలై 31వ తేదీ వ‌ర‌కు అందుకు గ‌డువు ఉండేది. కాగా దాన్ని ఇప్పుడు ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు పొడిగించారు.

10. క‌ర్ణాట‌క‌లో క‌రోనా మ‌ర‌ణ మృదంగం మోగిస్తోంది. ఒక్క రోజులోనే అక్క‌డ క‌రోనాతో ఏకంగా 84 మంది చ‌నిపోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 5,483 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,115కు చేరుకుంది. 49,788 మంది కోలుకున్నారు. 72,005 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం 2314 మంది చ‌నిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version