కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (05-08-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో బుధ‌‌వారం (05-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 5th august 2020

1. ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 10,128 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,86,461కి చేరుకుంది. మొత్తం 1681 మంది చ‌నిపోయారు. 80,426 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 1,04,354 మంది కోలుకున్నారు.

2. క‌రోనా నేప‌థ్యంలో దుబాయ్‌కి షిఫ్ట్ అయిన ఐపీఎల్‌కు ప్లేయ‌ర్లు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు త‌మ ప్లేయ‌ర్ల‌కు ఒక్కొక్క‌రికి 5 సార్లు క‌రోనా టెస్టులు చేయ‌నుంది. ఇక ప్లేయ‌ర్ల‌ను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతామ‌ని ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం తెలిపింది.

3. జైడ‌స్ కాడిలా కంపెనీ త‌న జైకోవ్‌-డి క‌రోనా వ్యాక్సిన్‌కు గాను గురువారం నుంచి రెండో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను చేప‌ట్ట‌నుంది. జూలై 15న ఆ వ్యాక్సిన్‌కు మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్ ప్రారంభించారు. అందులో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ల‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాలేద‌ని, వారు బాగానే ఉన్నార‌ని ఆ కంపెనీ తెలియ‌జేసింది.

4. లుపిన్ అనే ఫార్మా కంపెనీ ఫావిర‌పిర్ మందుకు గాను కోవిహాల్ట్ పేరిట మెడిసిన్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. ఈ మెడిసిన్ ఉత్ప‌త్తికి ఇప్ప‌టికే ఆ కంపెనీ డీసీజీఐ నుంచి అనుమ‌తులు పొందింది. కోవిహాల్ట్ ఒక్కో ట్యాబ్లెట్‌ను రూ.49కి విక్ర‌యించ‌నున్నారు.

5. ఏపీ ప్ర‌భుత్వం అన్‌లాక్ 3.0 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌క‌టించింది. కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల‌నే రాష్ట్రంలో పాటిస్తున్న‌ట్లు తెలిపింది. అందులో భాగంగా జిమ్‌లు, యోగా సెంట‌ర్లు ఓపెన్ అవుతాయి. సినిమా హాల్స్‌, స్విమ్మింగ్ పూల్స్‌, బార్‌లు క్లోజ్ అయి ఉంటాయి.

6. హైద‌రాబాద్‌కు చెందిన జెనారా ఫార్మా అనే కంపెనీకి కోవిడ్ డ్ర‌గ్ పావిపిర‌విర్‌ను త‌యారు చేసేందుకు డీసీజీఐ అనుమ‌తులు ఇచ్చింది. స‌ద‌రు డ్ర‌గ్‌ను ఆ కంపెనీ ఫావిజెన్ పేరిట త‌యారు చేసి మార్కెట్‌లో విక్ర‌యించ‌నుంది. అయితే ఆ మెడిసిన్ ఒక్క ట్యాబ్లెట్‌ను ఎంత‌కు అమ్మేదీ.. ఆ కంపెనీ వెల్ల‌డించ‌లేదు.

7. సుప్ర‌సిద్ధ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా సోకింది. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో ఆయ‌న టెస్టులు చేయించుకున్నారు. దీంతో పాజిటివ్‌గా నిర్దార‌ణ అయింది. ఈ క్ర‌మంలో ఆయన చెన్నైలో ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు.

8. తెలంగాణ‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2012 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క రోజులోనే 13 మంది చ‌నిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 576కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 19,568 ఉండ‌గా, 50వేల మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.

9. దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో ఏకంగా 51,706 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 19,08,254కు చేరుకోగా, 12,82,215 మంది కోలుకున్నారు. 39,795 మంది చ‌నిపోయారు. 5,86,244 మంది చికిత్స తీసుకుంటున్నారు.

10. క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులో ఉండాల‌ని, కేవ‌లం ధ‌నికుల‌కు మాత్ర‌మే ల‌భించ‌కూడ‌ద‌ని ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్ అన్నారు. 2021 చివ‌రి వ‌ర‌కు క‌రోనా ప్ర‌పంచ వ్యాప్తంగా అంత‌మ‌వుతుంద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news