కరోనా పాజిటివ్: దుబాయి పారిపోయిన ఒమిక్రాన్ పేషెంట్

-

విదేశాల నుంచి వచ్చిన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్ రావడంతో వైరస్ లక్షణాలు లేవని హోటల్‌లో క్వారంటైన్ కావాలని వైద్యులు సూచించారు. కానీ, అతను హోటల్ నుంచి పారిపోయాడు. తీరా అతనికి సోకింది ఒమిక్రాన్ వేరియంట్ అని నిర్ధారణ కావడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ వృద్ధుడి గురించి ఆరా తీస్తే దుబాయి పారిపోయినట్లు తేలింది.

ఈ నెల 20న సౌతాఫ్రికా నుంచి 66ఏండ్ల వృద్ధుడు బెంగళూరుకు వచ్చాడు. ఎయిర్ పోర్టులో చేసిన టెస్టులో పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలే ఉండటంతో హోటల్‌లోనే క్వారంటైన్ కావాలని సూచించార. అతని శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షకు పంపగా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తేలింది. ఈలోగా ఆ వృద్ధుడు హోటల్‌ను ఖాళీ చేసి వెళ్లిపాయాడు. ఎక్కడికి వెళ్లాడని ఆరా తీయగా ప్రైవేట్ ల్యాబ్ నుంచి కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ తీసుకుని దుబాయి పారిపోయినట్లు తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news