ఏపీ తెలంగాణ రైతులు అప్పుల ఊబిలోకి ఉన్నట్టు కేంద్రమంత్రి రాజ్యసభలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో 93.2 శాతం రైతులు, తెలంగాణ లో 91.7 కుటుంబాలపై రుణ భారం ఉన్నట్టు స్పష్టం చేశారు. దేశంలోనే అప్పుల్లో కూరుకున్న అత్యధిక వ్యవసాయ కుటుంబాల్లో ఏపీ తెలంగాణ లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయని…అందులో ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా….తెలంగాణ రెండో స్థానం లో ఉందని చెప్పారు.
అదే విధంగా కేరళలో 69.9 శాతం రైతులు, కర్ణాటక లో 67.7 శాతం రైతులు, తమిళనాడు లో 65.1 శాతం రైతులు, ఒడిశా లో 61.2 శాతం రైతులు , మహారాష్ట్ర లో 54 శాతం రైతులు అప్పుల్లో వరుస స్థానాల్లో ఉన్నట్టు వెల్లడించారు. ఇక కేంద్ర మంత్రి తెలిపిన వివరాలు ఆందోళన కరంగా ఉన్నాయి. రైతు బంధు లాంటి పథకాలు అమలు చేస్తూ ధనిక రాష్ట్రం గా చెప్పుకునే రాష్ట్రాల్లో రైతులు ఇంకా అప్పుల భారం మోయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పంటలకు సరైన మద్దతు ధరలు లేక….పంట రుణాలు లేకనే రైతులు అప్పుల ఊబిలోకి దిగుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.