కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇదీ పక్కాగా ఉపశమనం ఇచ్చే వార్త. దేశంలో ఒకటి, రెండు రోజుల్లో మరో వ్యాక్సిన్‌కు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన మరో కొవిడ్ వ్యాక్సిన్ ‘కోవోవాక్స్’కు కొన్ని షరతులతో అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేయాలని దేశ సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ అథారిటీకి చెందిన నిపుణుల బృందం సిఫారసు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం కోవోవాక్స్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడం కోసం అనుమతి కోరుతూ డ్రంగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు అక్టోబర్‌లోనే సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)లో ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ దరఖాస్తు చేశారు.
కోవోవాక్స్ టీకా అత్యవసర వినియోగ అనుమతి దరఖాస్తుపై రెండోసారి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు చెందిన కొవిడ్-19 సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్‌ఈసీ) సమీక్ష జరిపింది. వివరణాత్మక చర్చల అనంతరం కోవోవాక్స్‌కు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.