అందరికీ అందుబాటులోకి కోవిన్‌ రిజిస్ట్రేషన్‌

-

కొంతమంది వినియోగదారులకు పనిచేయని కోవిన్‌ వెబ్‌సైట్

ఈ రోజు నుంచి కోవిన్‌ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ అందరికీ అందుబాటులోకి వచ్చింది. రెండో దశలో వ్యాక్సినేషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వివిధ రుగ్మతలతో బాధపడేవారికి అందుబాటులోకి తెచ్చింది. అర్హులైనవారు టీకా వేసుకోవడానికి కోవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి పోర్టల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలని భావించినప్పటికీ, వెబ్‌సైట్, ఆరోగ్య సేతు యాప్‌లు రెండూ కొంత మంది వినియోగదారులకు సరిగా పనిచేయడం లేదు.

కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌ కోసం ఆన్‌లైన్‌ నమోదు ఇలా..

ఓటీపీ పొందిన తర్వాత డిజిటల్‌ సెల్ఫ్‌ రిజిస్ట్రేషన్‌ మాడ్యుల్‌ ద్వారా మీ వివరాలను (పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ మొదలైనవి) నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత సైట్‌ సమీపంలోని టీకా కేంద్రాన్ని ఎన్నుకోవాలి. స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి తేదీని షెడ్యుల్‌ ఎంపిక చేసుకోవచ్చు. వినియోగదారులు రీషెడ్యుల్‌ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ నమోదును ఎస్‌ఎంఎస్‌ ద్వారా ధ్రువీకరిస్తారు.

టీకా మొదటి డోస్‌ తీసుకున్న 28 రోజులకు రెండో డోసుకు అపాయింట్‌మెంట్‌ ఆటోమెటిక్‌గా నమోదవుతుంది.

కోవిన్‌ టీకా నమోదు

పౌరుటు ఠీఠీఠీ.ఛిౌఠీజీn.జౌఠి.జీn లో నమోదు చేసుకోవాలి. సంబంధిత మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. బటన్‌ క్లిక్‌ చెస్తే ఓటీపీ ధ్రువీకరించడానికి బటన్‌ క్లిక్‌ చేయాలి. తర్వాత టీకా నమోదు పేజీ కనిపిస్తుంది. అవసరమైన వివరాలను నమోదు చేసి, వినియోగదారులు వారి ఫోటో, ఐడీ నంబర్, ఇతర వివరాలను జతపరచాలి. యూజర్‌ తమ ఆధార్‌ కార్డు, ఓటు కార్డు తదితర పత్రాలను ఫోటో ఐడీ ప్రూఫ్‌గా అందజేయాలి. సంబంధిత టీకా కేంద్రాన్ని ఎంచుకున్ని ఇచ్చిన తేదీనాడు వెళ్లాలి. ఇతర రుగ్మతలు ఉన్నవారు టీకా వెసుకోవడానికి వెళ్లినపుడు సంబంధిత పత్రాలను తీసుకెళ్లాలి.

టీకా వేయడానికి ఎంత వయస్సు ఉండాలి? ఇతర రుగ్మతలు ఉన్నవారు అర్హులు?
2022 జనవరి 1 నాటికి 60 సంవత్సరాల వయస్సు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న పౌరులందరూ నమోదు చేసుకోవచ్చు. 2022 జనవరి 1 నాటికి 45–59 ఏళ్ల వయస్సు ఉన్న ఇతర రుగ్మతలు ఉంటే నమోదు చేసుకోవచ్చు.
అర్హులు.. హెచ్‌ఐవీ, గడచిన రెండేళ్లలో ఆస్పత్రిలో చేరిన తీవ్ర శ్వాసకోశ వ్యాధి, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు మరిన్ని ఇతర 20 రకాల రుగ్మతల పూర్తి వివారలు కోవిన్‌ జాబితాలో ఉంది.

టీకా ధర ఎంత? సమీపంలోని టీకా కేంద్రాన్ని ఎలా కనుక్కోవాలి?
ప్రభుత్వా కేంద్రాల్లో టీకాను ఉచితంగా అందిస్తారు. ప్రైవేటు క్లినిక్‌లలో రూ. 250. ఆయుష్మాన్‌ భారత్‌ కింద10 వేల ప్రైవేటు ఆస్పత్రుల్లో, సీజీహెచ్‌ఎస్‌ కింద ఆమోదించబడిన 600కి పైగా ఆస్పత్రులు, రాష్ట్రప్రభుత్వ బీమా కిందకువచ్చే ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ టీకాను అందించడానికి ముందుకు వచ్చాయి. మీకు దగ్గరలో ఉన్న టీకా కేంద్రాన్ని తెలుసుకోవాలంటే మ్యాపిండియా.కామ్‌ పోర్టల్‌లో కూడా చూడవచ్చు. కోవిన్‌ పోర్టల్‌లో కూడా సమీప కేంద్రాల జాబితా అందుబాటులో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version