హైదరాబాద్​లోని సున్నితమైన ప్రాంతాలను సందర్శించిన సీపీ అంజనీ కుమార్

బక్రీద్ పండగను పురస్కరించుకొని హైదరాబాద్​లోని సున్నితమైన ప్రాంతాలను సందర్శించారు నగర కమిషనర్ అంజనీ కుమార్. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు వెళ్లే ముస్లిం సోదరులంతా తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

CP sanjanj I kumar
CP sanjanj I kumar

బక్రీద్ పండుగ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర కమిషనర్ అంజనీ కుమార్, పలువురు అదనపు కమిషనర్లు, ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్​లోని పలు సున్నితమైన ప్రాంతాలను సందర్శించారు. అక్కడ ఉన్న పోలీసులను అడిగి బందోబస్తు ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముస్లిం ప్రజలకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు వెళ్లినపుడు కూడా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. పాతబస్తీలోని సున్నిత ప్రాంతాల్లో పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు.