బిగ్ బాస్ షో బ్రోతల్ స్వర్గం.. రాత్రంతా ఒకే గదుల్లో ఉంటారు : సీపీఐ నారాయణ

బిగ్ బాస్ షో పై మరోసారి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిప్పులు చెరిగారు. బిగ్ బాస్ ఓ కాన్సర్ వ్యాధి లాంటిదని..అదో బ్రోతల్ స్వర్గమని ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ పైన తాను చాలా సంవత్సరాల నుండి పోరాడుతున్నానని.. కోర్టులు తాను వేసిన పిటిషన్ ను పెండింగ్ లో పెడుతున్నాయని మండిపడ్డారు.

బిగ్ బాస్ లో 105 రోజులు యువతి యువకులను ఒక గది లో పెడుతున్నారు..లోపల ఎం జరుగుతుందో ఎవరికి తెలుసు…? అని ప్రశ్నించారు. బిగ్ బాస్ కి ఛాలెంజ్ 24 గంటలు లైవ్ పెట్టగలరా.. ? రెడ్ లైట్ ఏరియా సంస్కృతి ని తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నాగార్జున హోస్టుగా ఉన్నారు.. దీని వల్ల సమాజానికి ఎం చెప్తున్నారు..? అని ప్రశ్నించారు. ఒకరితో ముద్దు పెట్టుకొని మరొకరితో డేటింగ్ చేస్తున్నారని.. ఇది సాంస్కృతిక దోపిడీ..దీనిని తక్షణమే బాన్ చేయాలని డిమాండ్ చేశారు. దీని పై మరోసారి కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు నారాయణ..