మోడీకి జై కొడితే..కవితను వదిలేస్తారు – నారాయణ

-

మోడీకి జై కొడితే..కవితను వదిలేస్తారని సీపీఐ నారాయణ అన్నారు. లిక్కర్‌ కేసులో కవిత ఇరుక్కున్న సంఘటనపై నారాయణ స్పందించారు. శత్రుశేశం ఉండకూడదని మోడీ ఆలోచన చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు నారాయణ. కల్వకుంట్ల కవిత మోడీకి జై కొడితే బయటికి వస్తారు… లేదంటే జైలుకెళ్తారన్నారు నారాయణ.

ఇక దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇదే కదా అంటూ కామెంట్‌ చేశారు. బీజేపీ లోకి వెళితే.. సత్య పురుషులు అవుతారని ఎద్దేవా చేశారు నారాయణ. కాగా, ఢిల్లీలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు..ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బండి సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు బీఆర్‌ఎస్‌ నేతలు. కవితపై చేసిన అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news