కమ్యూనిస్టులు అంటే ప్రజా పక్షం ఉండే పార్టీలు…రాజకీయ లబ్ది చూసుకోకుండా…ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కమ్యూనిస్టుల లక్ష్యం. అయితే ఇలా పోరాటాలు చేస్తూ రాజకీయంగా కూడా కమ్యూనిస్టులు సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫలితాలే వచ్చేవి. అయితే ఇదంతా ఒకప్పుడు..ఇప్పుడు కాదు రెండు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల పని అయిపోయింది. కాకపోతే కొద్దో గొప్పో తెలంగాణలో కమ్యూనిస్టులకు కాస్త బలం.
అలా అని సింగిల్ గా గెలిచే బలం ఆ పార్టీలకు లేదు. కానీ గెలుపోటములని ప్రభావితం చేయగలవు. అది కూడా కొన్ని నియోజకవర్గాల్లోనే. అయితే మునుగోడులో కమ్యూనిస్టులకు బలం ఉంది…కానీ గెలిచే బలం లేదు. అందుకే కేసీఆర్…కమ్యూనిస్టుల మద్ధతు తీసుకునే గెలవచ్చని భావించి…మునుగోడులో సిపిఐ, సిపిఎం పార్టీల మద్ధతు తీసుకున్నారు. అటు ఆ రెండు కమ్యూనిస్టు పార్టీలు కూడా బీజేపీని ఓడించడం కోసం టీఆర్ఎస్ తో జట్టు కట్టాయి.
ఎలాగైనా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి…బీజేపీకి చెక్ పెడతామని కమ్యూనిస్టులు సవాల్ విసురుతున్నారు. అసలు రాష్ట్రంలో బీజేపీకి అధికారం దక్కకుండ చేస్తామని సవాళ్ళు విసురుతున్నారు. తమకు గెలిచే బలం లేదని, అందుకే టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇస్తున్నామని చెబుతున్నారు. అయితే తాజాగా మునుగోడులో కమ్యూనిస్టు శ్రేణులని ఏకం చేసే పనిలో పడ్డారు. నియోజకవర్గంలో కమ్యూనిస్టు కార్యకర్తలంతా టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇవ్వాలని కమ్యూనిస్టు నేతలు పిలుపునిచ్చారు.
అయితే మునుగోడులో కమ్యూనిస్టు కార్యకర్తలు కాస్త కాంగ్రెస్ పట్ల సానుభూతిలో ఉన్నారని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో వారు టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇవ్వడం కష్టమే అని తెలుస్తోంది. కానీ బీజేపీ వైపుకు మాత్రం కమ్యూనిస్టు కార్యకర్తలు వెళ్ళే అవకాశం లేదు. అదే సమయంలో మునుగోడులో టీఆర్ఎస్ గెలుపుకు కమ్యూనిస్టులు ఎంతవరకు హెల్ప్ అవుతారో చూడాలి. ఇక ఈ ఎన్నిక తర్వాత కూడా కమ్యూనిస్టులు టీఆర్ఎస్ తో పొత్తు కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే సిపిఐతో పొత్తు కంటిన్యూ అని తెలుస్తోంది.