పవన్, రానా మల్టీస్టారర్ కి క్రేజీ టైటిల్…

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భళ్ళాల దేవ రానా దగ్గుబాటి హీరోలుగా భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమం నిన్న జరిగింది. మళయాలంలో సూపర్ హిట్ అనిపించుకున్న అయ్యప్పనుమ్ కోషియం సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుందని చెప్పుకుంటున్నారు. ఈ మేరకు చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ విషయమై వార్తలు వస్తూనే ఉన్నాయి.

- Advertisement -

ఐతే ఇద్దరు క్రేజీ హీరోలు నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ఎలా ఉంటుందనే విషయం అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న సినిమాకి బిల్లా రంగా అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. పవర్ స్టార్ బిల్లాగా, రానా రంగా గా కనిపిస్తారట. 1982లో బిల్లారంగా పేరుతో చిరంజీవి, మోహాన్ బాబు కాంబినేషన్లో సినిమా తెరకెక్కింది. అదే టైటిల్ ని ఇప్పుడు వాడాలని అనుకుంటున్నారట. మరి చిత్రబృందం ఏ టైటిల్ ని ఫైనల్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...