ప్రపంచవ్యాప్తంగా ఉన్న షాపింగ్ కి అడిక్ట్ అయినా అందరు వ్యక్తులకి ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అదేమంటే వీరు షాపింగ్ చేసే సమయంలో ఎక్కువగా షాపింగ్ మాల్స్ మరియు రిటైల్ అవుట్లెట్ లో క్రెడిట్ కార్డులను తరచుగా ఉపయోగించడం. చాలా మందికి ఇది ఒక రకమైన వ్యసనం అని చెప్పక తప్పదు. కానీ తాజాగా ఒక కొత్త అధ్యయనం ప్రకారం ఈ షాపింగ్ కి అడిక్ట్ అయిన వ్యక్తులు క్రెడిట్ కార్డు వాడటానికి బానిసలవుతారట.
మసాచుసెట్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నిర్వహించిన అధ్యయనం ప్రకారం, క్రెడిట్ కార్డు కొనుగోళ్లు కొకైన్ మాదిరిగానే మెదడులో ఒక రియాక్షన్ ని ఏర్పాటు చేస్తాయట. మరింత అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది మెదడుకు కొకైన్ మాదిరిగానే ‘కిక్’ ఇస్తుందట. ఇక ఇలా షాపింగ్ చేస్తున్న సమయంలో నగదు కాకుండా ప్లాస్టిక్ (కార్డు)ను ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కువ ఖర్చు చేయడం సాధారణ విషయంగా మారిపోయిందని అంటున్నారు. ఇక COVID-19 మహమ్మారి నగదు లావాదేవీల భయాన్ని రేకెత్తించిన తరువాత 2020 నుండి ఇది మరింత పెరిగిందని అంటున్నారు.