స్తూడెంట్స్ కి కూడా బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్ ని అందిస్తున్నాయి. అయితే ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ లోన్ కస్టమర్లకు మాత్రమే ప్రత్యేక క్రెడిట్ కార్డ్ ని అందిస్తోంది. ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం ద్వారా ఎస్‌బిఐ స్టూడెంట్ ప్లస్ అడ్వాంటేజ్ కార్డుని పొందవచ్చు.
ఇది ఇలా ఉంటే ఎడ్యుకేషన్ లోన్‌ను సకాలం లో చెల్లించే వారికి 20 నుండి 50 రోజుల వరకు వడ్డీ లేని క్రెడిట్ లభిస్తుంది. ఈ కార్డు వలన అదనపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. మొత్తం లిమిట్లో 80% నగదును ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంటుంది. EMI లకు మార్చడానికి ఫ్లెక్సిపే ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.
ఇది ఇలా ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా స్టూడెంట్ క్రెడిట్ కార్డు విద్యార్థుల కోసం తీసుకు రావడం జరిగింది. విద్యార్థుల జీవన వ్యయాలన్నిటితో పాటు ట్యూషన్ ఫీజు/ హాస్టల్ ఫీజు చెల్లించడం, విమాన టిక్కెట్లను కొనడం వంటి కొనుగోళ్లను నిర్వహించడానికి ఉపయోగ పడుతుంది. స్టూడెంట్ ట్రావెల్ కార్డ్ విదేశాల లో చదువుతున్న విద్యార్థులకు ఉత్తమ ఎంపిక. ఈ కార్డు తో USD, EUR, GBP, AUD, CAD వంటి ఐదు వేర్వేరు కరెన్సీలలో నగదు లావాదేవీలు జరపవచ్చు.