CRICKET RECORDS: అరుదైన ఘనత సాధించిన జడేజా

-

ప్రస్తుతం కొలంబో స్టేడియం లో ఇండియా మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఎదురీదుతోంది. మొదటి నాలుగు వెకెట్లను టపా టపా కూల్చేసిన ఇండియా బౌలర్లు షకీబ్ మరియు హృదయ్ లకు మాత్రం చాలా స్కోప్ ఇచ్చేశారు. వీరిద్దరూ అయిదవ వికెట్ కు 101 పరుగులు జోడించారు. ఆ తర్వాత వీరి జోడీని శార్దూల్ ఠాకూర్ విడదీశాడు, ఆలా షకిబుల్ హాసన్ 80 పరుగుల తర్వాత అవుట్ అయ్యాడు.. అనంతరం హృదయ్ సైతం అర్ద సెంచరీ పూర్తయ్యాక అవుట్ అయ్యాడు. ఇక ఇండియా బౌలర్లలో జడేజా ఈ మ్యాచ్ లో ఒక అరుదైన ఘనతను సాధించాడు. జడేజా షమీమ్ హోసెన్ ను అవుట్ చేయడం ద్వారా వన్ డే లలో 200 వికెట్లను పడగొట్టి రికార్డు సాధించాడు.

అయితే ఈ ఘనతను ఇప్పటికే ఆరుగురు ఇండియా బౌలర్లు సాధించగా, జడేజా ఏడవవాడు కావడం విశేషం.. ఇతనికన్నా ముందు కుంబ్లే 337 వికెట్లు , శ్రీనాధ్ 315, అగార్కర్ 288, జహీర్ ఖాన్ 282, హర్భజన్ 269, కపిల్ దేవ్ 253 లు ఉన్నారు ..

Read more RELATED
Recommended to you

Latest news