లోకేశ్ ఢిల్లీకి వెళ్లినంత మాత్రాన ఏమీ కాదు : మంత్రి కొట్టు

-

నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి ఊడపొడిచేది ఏమీలేదన్నారు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. లోకేష్ ఢిల్లీ వెళ్లినంత మాత్రాన రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మారిపోతాయా? అని ప్రశ్నించారు మంత్రి కొట్టు. తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ.. ‘జనసేన తో టీడీపీ కలవడం వల్ల కూడా చాలామంది టీడీపీ నుంచి బయటకు పోయేందుకు రెడీగా ఉన్నారు. జైలుకు వెళ్లి సాష్టాంగ నమస్కారంతో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్యాకేజీ మాట్లాడుకుని వచ్చాడు కదా. పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండి సేవ చేయాలనుకున్న జనసైనికులు చంద్రబాబుకి సేవ చేయండని చెప్పగానే సగం మంది నీకు నీ పార్టీకి దండం అని జారిపోయారు’ అని హేళన చేశారు.

Kottu Satyanarayana invites CM YS Jagan to Srisailam Brahmotsavams

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు పెళ్లి ఒకరితో సంసారం మరొకరితో అన్నట్లుగా ఉందన్నారు. జైలుకెళ్లి సాష్టాంగ నమస్కారంతో చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్నారని ఆరోపించారు. జనసేనతో కలవడం వల్ల ఎంతోమంది నేతలు టీడీపీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇంకో వైపు, పవన్‌పై అభిమానంతో పార్టీకి సేవ చేయాలనుకున్న జనసైనికులు.. ఇప్పుడు చంద్రబాబుకు సేవ అనగానే సగం మంది జనసేనకు దండం పెట్టి వెళ్లిపోయారన్నారు మంత్రి కొట్టు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news