బలవంతగా శృంగారం…ఆవేశంతో ప్రియుడి పురుషాంగంపై !

-

లకింపూర్ కేరి జిల్లాలోని మహివాగంజ్ ఏరియాలో 36 ఏళ్ల మహిళ, భర్తను వదిలేసి రెండేళ్లుగా 32 ఏళ్ల ప్రియుడితో కలిసి నివసిస్తోంది. భర్త మద్యానికి బానిసై తనను ఇబ్బందులు పెడుతున్నాడన్న కారణంతో అతడిని వదిలేసి ప్రియుడితో కలిసి జీవిస్తోంది. వ్యవసాయ కూలీగా పని చేస్తున్న మహిళకి 14 ఏళ్ల కూతురు ఉంది.

అయితే ఈ  బుధవారం పని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన మహిళ తన 14 ఏళ్ల కూతురిపై ప్రియుడు అత్యాచారానికి పాల్పడుతుండటాన్ని గమనించింది. వెంటనే ప్రియుడి నుంచి కూతురిని రక్షించేందుకు ప్రయత్నించింది. అయితే తనకు అడ్డొస్తే చంపేస్తా అంటూ మహిళను ఆమె ప్రియుడు బెదిరించాడు. అంతేకాకుండా ఆమెపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించాడు.

దీంతో అతడి నుంచి తప్పించుకొని వంట గదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తెచ్చి ప్రియుడి పురుషాంగాన్ని కోసేసింది. అతడికి బుద్ధి చెప్పేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని, తాను చేసిన పనికి ఏమి పశ్చాత్తాప పడటం లేదని మహిళా తెలిపింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం(POCSO)సహా పలు సెక్షన్ల కింద మహిళ ప్రియుడి పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం లక్నోకు తరలించినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news