BREAKING : అలిపిరి చెక్ పోస్ట్ వద్ద తిరుమల భక్తుడి దారుణ హత్య

-

తిరుపతి లో దారుణం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓ భక్తుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన అలిపిరి పాత చెక్ పోస్ట్ దగ్గర నిన్న అర్థరాత్రి జరిగింది. మద్యం మత్తులో బీడీ ముక్క కోసం ఇద్దరు భక్తుల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం అందుతుంది.

 

ఈ నేపథ్యంలోనే బీడీ కోసం… ఓ భక్తుడిని బండరాయితో కొట్టి చంపాడు మరో భక్తుడు. మృతుడు తమిళనాడు రాష్ట్రం, తంజావూరుకు చెందిన విఘ్నేష్ గా గుర్తించారు పోలీసులు. అలాగే ఘాతుకానికి పాల్పడ్డిన మారయ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version