హైదరాబాద్ లో మరో యువతిపై లైంగిక దాడి.. పబ్ కు వెళ్లి వస్తుండగా !

-

దేశంలో మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా… ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఏమాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా హైదరాబాద్ లో ఓ మహిళపై లైంగిక దాడి ఘటన మరువక ముందే మరో ఘటన తెరపైకి వచ్చింది.

బాచుపల్లి పరిధిలో ఓ యువతిపై స్నేహితుడే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈనెల 13వ తేదీన ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్లోని ఓ పబ్ కు యువతి వెళ్ళింది. ఆమె ఇంటి వద్ద దింపుతానని యువతిని అతడు నమ్మించాడు. ఆమె నిద్ర మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. వెంటనే తేరుకుని యువతి అరవడంతో పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఆ నిందితుడు పరారీలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version