కరీంనగర్ జిల్లాలో దారుణం…యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగులు..,!

కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. కరీం నగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ ఘటనలో యువకుడు పూర్తిగా కాలిపోయాడు.

crime
crime

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో లో యువకుడి శరీరం పూర్తిగా కాలిపోయినట్టు కనిపిస్తోంది. చెట్ల పొదల్లో యువకుడిపై దాడి చేసి హతమార్చినట్లు కనిపిస్తోంది. ఘటనా స్థలాన్ని సీఐ రాంచందర్ రావు పరిశీలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే దుండగులు ఎవరా అన్నది ఇంకా తెలియ లేదు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.