అలర్ట్ : ఈరోజు రేపు తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు..!

తెలంగాణలో ఈరోజు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమైందని సోమవారం అయుగుండం గా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరశాఖ రాష్ట్ర సంచాలకులు నాగరత్న తెలిపారు. ఇది ఒడిస్సా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల మీదుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

దానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడి…పశ్చిమ భారత్ నుండి తెలంగాణ వైపుకు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని చెప్పారు. దాని ప్రభావం తోనే తెలంగాణ లో నేడు రేపు భారీ వర్షాల నుండి కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దాంతో తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. ఇక ఇప్పటికే రాష్ట్రం లో కురిసిన భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న సంగతి తెలిసిందే. దాంతో మరో రెండు రోజులు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది.