అయ్యబాబోయ్! పెన్షన్ ఖాతాలో రూ.75కోట్లు

-

ఓ వృద్ధుడు పెన్షన్ డబ్బుల కోసం సమీపంలోని రూరల్ సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లాడు. రూ.10,000 విత్‌డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే దిమ్మతిరిగి రూ.కోట్లు కనిపించాయి. ఇంకా ఏకంగా రూ.75.28కోట్ల నగదు ఉన్నట్టు కనిపించడంతో బిత్తరపోవడం అతని వంతయ్యింది.

ఝార్ఖండ్ రాష్ట్రం దుమ్కా జిల్లా జార్ముండి మండలం సాగర్ గ్రామంలో భార్య, కుమారుడితో కలసి పూలోరాయ్ అనే వ్యక్తి జీవనం సాగసిస్తున్నాడు. అతనో నిరుపేద. గ్రామంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో అతడికి పెన్షన్ ఖాతా ఉన్నది. పెన్షన్ డబ్బుల కోసం పూలోరాయ్ స్థానికంగా రూరల్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాడు. రూ.10వేల నగదు తీసుకోగా బ్యాలెన్స్ రూ.75.28కోట్లు కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తన ఖాతాలోకి ఇంత డబ్బు ఎలా వచ్చిందో తెలియదని పూలోరాయ్ చెప్పాడు.

గత కొద్దిరోజులుగా పూలోరాయ్ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా లేదని బ్యాంకు అధికారులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో అన్న దానిపై విచారుణ చేస్తున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news