దేశంలో మహిళలపై ఆకృత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో అక్కడ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిర్భయ ఘటనను తలపించే సంఘటన ఒకటి రాజస్తాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 15 ఏండ్ల బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన దుర్మార్గులు, ఆమె జననేంద్రియాలను పదునైన వస్తువులతో తీవ్రంగా గాయపరిచారు. అనంతరం బాలిక చనిపోయిందని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.
రాజస్తాన్ రాష్ట్రం ఆళ్వారులోని మలఖేడ్ గ్రామంలోని కల్వర్టు సమీపంలో చావుబతుకుల మధ్య ఉన్న బాలికను చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని హాస్పిటల్‌కు తరలించారు. మిస్సింగ్ కేసు ఆధారంగా తల్లిదండ్రులను పిలిపించగా ఆ బాలికను గుర్తించారు. ఆ దుర్మార్గులు బాలిక జననేంద్రియాలను పదునైన వస్తువులతో తీవ్రంగా గాయపరిచారని పోలీసులు తెలిపారు.