మగవాళ్ళని రేప్ చేస్తున్న మగాడు. టార్గెట్ అలాంటోళ్లే

-

కామంతో కళ్లు మూసుకునిపోయిన కామాందులు చేస్తున్న అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. మొన్న ఒక మేకను , నిన్న 8 నెలల గర్భవతిని రేప్‌ చేసిన కామాంధుల వార్తలు చదివాం.. మగవాళ్లను రేప్‌ చేసే మృగాడి వార్త చదవబోతున్నారు.

స్వలింగ సంపర్కం అనేది భారత శిక్షాస్మృతి 377 వ సెక్షన్ ప్రకారం నేరం. అలాంటిది ఒక మగాడు మరొక మగాడిని రేప్ చేయడం విస్మయానికి గురిచేసే విషయం. ఇప్పుడు అలాంటి సంఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలనే అరికట్టలేక ఆందోళన పడుతుంటే కొత్తగా మగవారిపైన, బాలురిపైన కూడా అత్యాచారాలు మొదలయ్యాయి. అది కూడా ఒక మగవాడి మీద మరొక మగాడు అత్యాచారయత్నం చేయడం షాకింగ్. తాజాగా మాయమాటలు చెప్పి యువకులపై అత్యాచారాలు చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహారాష్ట్రకు చెందిన ఓం ప్రకాష్ అనే వ్యక్తి హోమోసెక్స్ కు బానిస అయ్యాడు. అబ్బాయిలు కనిపిస్తే చాలు వారిని లోబరుచుకోవటానికి ప్రయత్నిస్తాడు. యువకులకు వివిధ రకాలుగా మాయమాటలు చెప్పి ఈ అకృత్యాలు చేస్తున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తాను, నాతో రా అంటూ వారిని లాడ్జికి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఒక్క మహారాష్ట్రలోని కాదు పలు రాష్ట్రాల్లో తిరుగుతూ అమాయకంగా కనిపించే అబ్బాయిలను టార్గెట్ చేస్తున్నాడు. వారికి మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి గొలుసులతో బంధించి అత్యాచారం చేస్తాడు. తర్వాత వారికి కనపడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.

మహారాష్ట్రలో ఇతనిపై ఒక యువకుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు అతనిపై నిఘా పెట్టి కేసు విచారిస్తున్నారు. దీంతో మహారాష్ట్ర నుండి పారిపోయి తెలంగాణ చేరుకున్నాడు ఓం ప్రకాష్. కరీంనగర్ లోని ఒక లాడ్జిలో దాక్కున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ లాడ్జిలో అతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం ఓం ప్రకాష్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version