దివ్యాంగుడిని చితకబాదిన పోలీసీులు.. ఇద్దరు సస్పెండ్, ఒకరిపై కేసు

-

దివ్యాంగుడిని దారుణంగా కర్రలతో కొట్టిన పోలీసులపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు మరొకరిపై కేసు పెట్టారు. ఈ ఘటన బిహార్‌లోని కతిహార్‌ జిల్లాలో సోమవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. మానసిక స్థితి సరిగ్గా లేని ఓ వ్యక్తి రోడ్డుపై పార్క్‌ చేసిన పోలీస్‌ వాహనానికి ఆనుకుని కూర్చున్నాడు.ఇది చూసి పోలీసులు ఆగ్రహంతో ఊగిపోయారు. సదరు వ్యక్తిపై కర్రలతో దాడి చేశారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే కతిహార్ ఎస్పీ ఈ ఘటనపై స్పందించారు. ఏఎస్‌ఐ కేదార్ ప్రసాద్ యాదవ్‌, కానిస్టేబుల్ ప్రీతి కుమారిని సస్పెండ్‌ చేశారు. అంతేకాకుండా దివ్యాంగుడిని చితకబాదిన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version