బ్లూవేల్ గేమ్ బారిన పడి.. 12 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య

-

ఆ పిల్లాడి వయసే 12 ఏళ్లు. పేరు సమర్థ్. చదివేది ఏడో తరగతి. కానీ.. ఆలోచనలు మాత్రం చాలా పెద్దవి. ఎంతలా అంటే సూసైడ్ చేసుకునేంతలా.. కర్ణాటకలోని కలబురిగిలో ఈ విషాద ఘటన చోటు చేసుకున్నది. ఇంత చిన్న వయసులో అంత దారుణ ఆలోచన ఆ పిల్లాడికి ఎలా వచ్చిందా ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ మధ్య బ్లూవేల్ గేమ్ అని ఒక ఆన్ లైన్ గేమ్ ఒకటి బాగా లైమ్ లైట్ లోకి వచ్చింది గుర్తుందా? అవును.. ఆ గేమ్ కు బానిసయిన చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. ఆ గేమ్ డిజైనింగే అలా ఉంటుంది. గేమ్ రూల్స్ ప్రకారం.. అన్ని లేవల్స్ అయిపోయాక.. చివరి లేవల్ లో సూసైడ్ చేసుకోవాలి. ఆ గేమ్ కు అడిక్ట్ అయిన పిల్లలు అన్ని లేవల్స్ పూర్తి చేసి చివరకు తనువు కూడా చాలిస్తున్నారు. తర్వాత బ్లూ వేల్ గేమ్ ఘటనలు తగ్గినప్పటికీ తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ విద్యార్థి కూడా బ్లూవేల్ గేమ్ బారిన పడే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొన్ని రోజులుగా విపరీతంగా మొబైల్ ఫోన్ ను ఉపయోగిస్తున్నాడు. ఎప్పుడూ మొబైల్ ఫోన్ లోనే ఆ పిల్లాడు గడుపుతుండగా.. మామూలుగా ఏదో గేమ్స్ ఆడుకుంటున్నాడేమో అని తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు. కానీ.. అదే ఆ పిల్లాడి ప్రాణాన్ని బలిగొన్నది. తల్లి బయటికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లాడు ఉపయోగించిన మొబైల్ ఫోన్ ద్వారా బ్లూ వేల్ గేమ్ కు అడిక్ట్ అయ్యే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news