భారత్‌ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలని అటు కేంద్ర సర్కార్‌తో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అందుకే మత్తు పదార్థాల రవాణా, సరఫరా, వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఎప్పటికప్పుడు డ్రగ్స్ సరఫరాను కట్టడి చేస్తూ పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయి.
తాజాగా ముంబయిలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. నావశేశా పోర్టులో ఓ కంటైనర్ నుంచి దాదాపు 22 టన్నుల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్‌తో పాటు కంటైనర్‌ను కూడా సీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ హెరాయిన్ విలువ దాదాపు రూ.1,725 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఈ హెరాయిన్ ఎక్కడి నుంచి వస్తోంది..? ఎవరు సరఫరా చేస్తున్నారు..? ఎవరికి సరఫరా చేస్తున్నారు..? కంటైనర్‌తోపాటు స్మగ్లర్లను పట్టుకున్నారా అనే విషయాలేం తెలియదు. దీనిపై త్వరలోనే అధికారులు పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.