గుంటూర్ లో దారుణం : కృష్షా న‌దీ లో 6గురు విద్యార్థుల గల్లంతు మృతి

ఆంధ్ర ప్ర‌దేశ్ లో ని గుంటూర్ జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. గుంటూర్ జిల్లా లో ని అచ్చంపేట మండలం మాదిపాడు కృష్ణా న‌ది కి స్నానానికి అని వెళ్లిన ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గ‌ల్లంతు అయ్యారు. వీరంత స్థానికం గా ఉన్న వేద పాఠ‌శాల‌లోని వారి తెలిసింది. గ‌ల్లంతు అయిన వారి కోసం స్థానికులు, పోలీసులు తీవ్రం గా శ్ర‌మించారు. స్థానిక‌లు సాయం తో మొందు మూడు మృత దేహాల ను పోలీసులు వెలికి తీశారు.

మిగిలిన ముగ్గురి కోసం తీవ్రంగా కష్ట ప‌డినా మృత దేహాలు ల‌భించ‌లేదు. దీంతో పోలీసులు స్థానికం గా ఉండే జాల‌ర్ల సాయం తీసుకున్నారు. జాల‌ర్ల సాయం తో మ‌రో మూడు మృత దేహాల‌ను వెలికి తీశారు. కృష్టా న‌ది లో గ‌ల్లంతు అయిన మొత్తం ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. అయితే విద్యార్థులకు ఈత రాక‌పోవ‌డం వ‌ల్లే మృతి చెందార‌ని తెలుస్తుంది. అలాగే కృష్ణా న‌ది లో నీటి ప్ర‌వాహాం తీవ్ర‌త ఎక్కువ గా ఉండ‌టం వ‌ల్ల మృతిల సంఖ్య పెరిగింద‌ని తెలుస్తుంది.