ఆ యువకుడు ఆ బాలికను నగరంలోని రద్దీగా ఉన్న ఓ ప్రాంతంలోని ఒక రూమ్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం తన స్నేహితులు మరో 5 మందిని పిలిచి ఆమెపై అత్యాచారం చేయించాడు.
ప్రభుత్వాలు ఎంత కఠినమైన చట్టాలు తెచ్చినా.. యువతులు, మహిళలు, బాలికలపై కామాంధుల అకృత్యాలు ఆగడం లేదు. ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో తాజాగా మరొక అత్యాచార ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… గుంటూరుకు చెందిన ఓ బాలిక తన తాతకు అనారోగ్యంగా ఉండడంతో అతనికి సాయంగా అక్కడి హాస్పిటల్‌లో ఉండేది. అయితే ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన రాము అనే ట్యాక్సీ డ్రైవర్‌తో ఆ బాలికకు హాస్పిటల్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అది వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. క్రమంగా వారు రోజూ ఫోన్‌లో మాట్లాడుకోవడం ప్రారంభించారు.
అయితే ఆ బాలిక అలా రోజూ ఫోన్‌లో మాట్లాడుతుండడాన్ని ఆమె తల్లి గమనించి ఆమెను తీవ్రంగా మందలించింది. దీంతో కోపంతో ఆ బాలిక ఇల్లు వదిలి రాము ఉంటున్న ఒంగోలు ప్రాంతానికి బయల్దేరింది. ఒంగోలు బస్టాండ్‌కు చేరుకుని రాము కోసం అందరినీ అడిగింది. అయితే ఆమె ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో బస్టాండ్‌లోని ఓ దుకాణంలో చార్జింగ్ పెట్టుకుంది. ఆ దుకాణంలో పనిచేసే ఓ యువకుడు ఆ బాలికతో మాటలు కలిపి రాము దొరికే వరకు తన దగ్గర ఆశ్రయం కల్పిస్తానని నమ్మబలికాడు. దీంతో ఆ బాలిక అతనితో వెళ్లింది.
కాగా ఆ యువకుడు ఆ బాలికను నగరంలోని రద్దీగా ఉన్న ఓ ప్రాంతంలోని ఒక రూమ్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం తన స్నేహితులు మరో 5 మందిని పిలిచి ఆమెపై అత్యాచారం చేయించాడు. ఆ తరువాత నిన్న ఆ బాలికను వారు ఒంగోలు బస్టాండ్‌లో విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆ బాలిక ఆ బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయట పడింది. కాగా ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఇంటర్ చదివిన యువకులు ఇద్దరు ఉండగా, మరో నలుగురు ఇంజినీరింగ్ చదివారని తెలిసింది. ఇక ఈ ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ.. ఇప్పటికే కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నామని, ఆ ఆరుగుర్ని గుర్తించామని, వారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు.