- 8 మంది మృతి, 10 మందికి తీవ్ర గాయాలు
అమరావతి (గొల్లప్రోలు): తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద టాటా మ్యాజిక్ వాహనాన్ని డిప్పర్ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు. 216 జాతీయ రహదారి వద్ద చేబ్రోలు గ్రామ శివారు బైపాస్ రోడ్డుపై ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రగాయాలపాలైన ఇద్దరు పిఠాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా మాకవరం పాలేనికి చెందిన వీరంతా కాకినాడలో ఓ గృహ ప్రవేశానికి వెళ్లారు. అక్కడ అందరితో సంతోషంగా గడిపి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. క్షతగాత్రులను పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఘటనాస్థలాన్ని సీఐ అప్పారావు, ఎస్సై శివకృష్ణ పరిశీలించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు.