సోషల్ మీడియాలో చిన్నారుల అశ్లీల చిత్రాలు, వీడియోలను అప్లోడ్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు. ఫేస్బుక్, యూట్యూబ్, జిమెయిల్ ద్వారా పిల్లల అసలీల చిత్రాలను అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు ఏపీ సిఐడిి అధికారులు. ఈ కేసులో 12 మంది నిందితులు ఉండగా వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లుగా గుర్తించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కు సమాచారం ఇచ్చారు ఏపీ సిఐడి అధికారులు.
దీంతో రంగంలోకి దిగిన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు 67 బి, ఐటిఏ 2000 – 2008 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. వీడియోలు అప్లోడ్ చేసిన 12 మందిని విజయవాడ వాసులుగా గుర్తించారు. సోషల్ మీడియాలో చిన్నారులు అశ్లీల చిత్రాలు, వీడియోలు అప్లోడ్ చేయడం తీవ్రమైన నేరమని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.