సెల‌వు ఇవ్వ‌లేద‌ని ప్రాణం తీసుకున్న యువ‌కుడు

సాధార‌ణంగా ప‌ని చేసే కార్యాల‌యాల్లో సెల‌వు ఇవ్వ‌కుంటే క‌ష్టం గానో న‌ష్టం గానో ఆఫీస్ కు వెళ్తుం. అయితే ఒక యువ‌కుడు మాత్రం సెల‌వు ఇవ్వ‌లేద‌ని సూసైడ్ నోట్ రాసుకుని మ‌రి ఆత్మ హ‌త్య చేసుకున్నాడు. వివ‌రాల‌లో కి వెళ్తే.. హైద‌రాబాద్ న‌గ‌రంలో అనిల్ కుమార్ అనే యువ‌కుడు నివాసం ఉంటున్నాడు. అనిల్ లో శంషాబాద్ లో ని కొరియ‌ర్ ఆఫీస్ లో గ‌త కొద్ది రోజుల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే అనిల్ కు ఒక రోజు ప‌ని ఉండ‌టం వ‌ల్ల కొరియర్ ఆఫీస్ లో సెల‌వు కావాల‌ని అడిగాడు. అయితే కొరియ‌ర్ ఆఫీస్ వాళ్లు సెల‌వు ఇవ్వ‌లేదు. దీంతో అనిల్ మ‌న‌స్థాపానికి గురి అయ్యాడు. తన‌ను సెలవు అడిగితే ఇవ్వ‌కుండా ఉద్య‌గం ప‌రంగా వేధిస్తున్నార‌ని అనిల్ త‌న సూసైడ్ నోట్ లో రాసుకు వ‌చ్చాడు. త‌న సూసైడ్ నోట్ తో వ‌రంగ‌ల్ హైవే ప‌క్క‌న ఆత్మ హ‌త్య చేసుకున్నాడు. అయితే త‌న శవం వ‌ద్ద సూసైడ్ నోట్ ల‌భించ‌డం తో త‌న ఆత్మ హ‌త్య కు కార‌ణం తెలిసింది. అయితే పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.