బ్రేకింగ్ : ఎల్ రమణ కు ఎమ్మెల్సీ పదవి

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు చేశారు సిఎం కెసిఆర్. రేపు 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ వేయనున్నారు. ఎల్లుండితో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగియనుంది. ఇక ఈ 12 మందిలో ఏడుగురు కొత్త వారికి అవకాశం ఇచ్చారు సిఎం కెసిఆర్. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మంలో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు.

మహబూబ్‌నగర్‌లో ఒకరికి‌, కరీంనగర్‌లో ఒకరికి కొత్తవారికి అవకాశం ఇచ్చారు సిఎం కెసిఆర్. బీసీలకు 4, ఓసీలకు 7, ఎస్సీలకు ఒక సీటు ఇచ్చారు సిఎం కేసీఆర్. అయితే… ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులలో ఎల్ . రమణ కు ఛాన్స్ ఇచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల ముందే.. ఎల్ . రమణ.. టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరారు. బీసీ నేత, కరీంనగర్ జిల్లా కావడంతో ఎల్ . రమణ ఎమ్యెల్సీ ఛాన్స్ దక్కింది. ఇక అటు నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవిత సీటు మరో మహిళకు కేటాయించారు సిఎం కెసిఆర్. ఎన్నికల బాధ్యతను జిల్లా మంత్రులకు అప్పగించారు కేసీఆర్.