మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో ఒక దారుణం జరిగింది. జిల్లాలోని పెన్ ప్రాంతంలో మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర షీటర్ ను రాయ్‌గడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అత్యాచారం కేసులో అరెస్టయిన తర్వాత నిందితుడిని పెరోల్ పై జైలు నుంచి విడుదల చేశారు. ఈ సంఘటన డిసెంబర్ 30 న పెన్ లోని ఆదివాసి పాడా బాద్గావ్ ప్రాంతంలో తల్లిదండ్రుల గుడిసెలో నిద్రిస్తున్నప్పుడు జరిగింది.
అతేష్ పాటిల్ గా గుర్తించిన నిందితుడిని అత్యాచారం కేసులో పది రోజుల క్రితం పెరోల్ పై విడుదల చేశారు. గతంలో అతనిపై దొంగతనం, దాడి కేసులు కూడా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాటిల్ ఆమెను ఎత్తుకొని ఒక పాఠశాల వెనుక ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్ళాడు. పాటిల్ బాధితురాలిపై అత్యాచారం చేసి చంపాడని ఆరోపించారు. బాధితురాలి మృతదేహాన్ని అమ్మమ్మ వద్ద పెట్టడానికి వెళ్ళగా అతన్ని గుర్తించారు.
అపుడు అతను పారిపోగా స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టి కొద్ది గంటల్లోనే పాటిల్ ను పట్టుకున్నారు. అత్యాచారం, హత్య మరియు పోక్సో (లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ) చట్టంలోని పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదైంది. ఈ సంఘటన తరువాత టౌన్‌షిప్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు డిమాండ్ చేశారు. కాని అతన్ని పెరోల్ పై విడుదల చేయడం తీవ్ర దుమారం రేపింది.