సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఓ స్టాయికి ఎదగాలనుకునే వారు అనేకం. ఈ క్రమంలోనే సినీ రంగంలో ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది. ఎన్నో కలలు కని సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలగాలని అనుకుంది. కానీ ఆమె నిరాశ తన ఆశలను, కలలను అడ్డుకుని తీరని లోకాలకు చేరువయ్యేలా చేసింది. ఈ విషాద గాధ ముంబైలో చోటుచేసుకుంది. లోఖండ్ వాలా ప్రాంతంలో కెన్‌వుడ్ అపార్ట్‌మెంట్ టెర్రస్ నుంచి దూకి ఓ వర్థమాన నటి శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడింది.
భవనంపై నుంచి పెద్దశబ్ధం రావటంతో పూలకుండీ కింద పడిపోయిందని భావించారు. అయితే తీరా చూస్తే రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ఒక యువతిని చూసి సంఘటనా స్థాలానికి చేసుకున్న వారు.. ఆమెను కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఇంతకీ ఆ మృతురాలు పెర్ల్ పంజాబీగా గుర్తించారు. ఆమె వయస్సు 22 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటుంది.
అయితే ఆమె సినీ రంగంలోకి ఎన్నో ఆశలతో తన టాలెంట్, అదృష్ణాన్ని పరిక్షించుకోవడానికి తల్లిదండ్రలతో గొడవపడి మరీ అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే అవకాశాల కోసం ఫిలిం ఆఫీసుల చుట్టూ ఎన్ని రకాలుగా ప్రయత్నించా కానీ.. ఆమె ఊహించిన విధంగా ఛాన్సు రాలేదు. ఇక చిన్నా చితకా అవకాశాలతో విసిగిపోయిన ఆమె ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరింది.
ఆమె ఉద్యోగం చేస్తూనే అవకాశాలకు కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే తల్లిదండ్రలు నుంచి సినీ ప్రయత్నాలు మానుకోమని ప్రెజర్ రావడం.. ఇలా ఎన్నో రకాల ఒత్తిడ్లకు గురైన ఆమె చివరకు జీవితంపై నిరాశ చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.