హైదరాబాద్ లో దారుణం.. అక్కా, తమ్ముడిపై దాడి.. తమ్ముడు మృతి

-

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు ఇంట్లో అక్కా, తమ్ముడు ఇద్దరే ఉన్నారని గమనించి ఓ దుండగుడు వారిపై దాడి చేశాడు. తొలుత ఈ దాడిలో చింటు (20) అని విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డుగా వెళ్లిన అక్క సంఘవి పై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో చింటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

అక్క సంఘవి ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సంఘవి హోమియోపతి చదువుతుంది. షాద్ నగర్ కి చెందిన సంఘవి గత కొంతకాలంలో ఎల్బీనగర్ లో నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో వీరిద్దరూ ఉండగా దుండగుడు కత్తితో దాడి చేశాడు. స్థానికులు దుండగుడిని నిర్భందించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.  ఈ దుండగుడు వీరిపై ఎందుకు దాడి చేశాడనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version