కొల్గూరులో దారుణం.. మహిళ ముఖంపై దిండుతో అదిమిపట్టి..!

-

గజ్వేల్ మండలం పరిధిలోని కొల్గూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అడిషనల్ డీసీీ అందె శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. చెన్న శ్యామల అనే మహిళా ఇవాళ ఉదయం 5.30 గంటల సమయంలో ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంటి ఆవరణలో ఉన్న వాష్ రూమ్ కి వెళ్లింది. ఇక అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని అగంతకుడు మహిళ భర్త శ్రీనివాస్ పడుకున్నది గమనించి బెడ్ రూమ్ కి గొల్లం పెట్టాడు. చెన్న శ్యామల వాష్ రూమ్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆమెను  దిండుతో ముఖంపై అదిమి పట్టుకోగా స్పృహ తప్పింది. 

మహిళా మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడు.. అరతులం చెవి కమ్మలు తీసుకొని పారిపోయాడు. 15 నిమిషాల తరువాత స్పృహలోకి వచ్చిన శ్యామల బెడ్ రూం గొళ్లెం తీసి జరిగిన సంఘటనను భర్తకు, చుట్టు పక్కల వారికి తెలిపింది. ప్రథమ చికిత్స గురించి శ్యామలను గజ్వేల్ లోని ఓ డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా.. మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఘటన స్థలాన్ని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news