దారుణం; అమ్మాయి పెళ్లికి నో చెప్పిందని ఎంత పని చేసాడో చూడండి…!

-

ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోను అంటే…? సాధారణంగా నిజాయితీగా ప్రేమించిన వారికి అయితే మాత్రం చాలా బాధగా ఉంటుంది. అమ్మాయిని ఏళ్ళ తరబడి ప్రేమించి ఆ అమ్మాయి కాదు అంటే భరించడం చాలా కష్టం అంటారు అబ్బాయిలు కూడా. ప్రేమించిన అమ్మాయి కోసం ఏది అయినా చేయడానికి సిద్దపడుతు ఉంటారు. ప్రాణాలు తీసుకుంటారు కొందరు అబ్బాయిలు అయితే.

మరి కొంత మంది దాన్ని మోస౦గా భావించి ప్రతీకారం తీర్చుకునే కార్యక్రమాలు చేసి చంపడం లేదా రేప్ చేయడం లేదా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. దీనితో ఇద్దరు నష్టపోయే ప్రమాదం ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఒక యువకుడు ప్రియురాలు ఇల్లు తగలబెట్టేసాడు. కడియం మండలం దుళ్లలో తనతో పెళ్లికి నిరాకరించిందని ఆగ్రహించి, ఆమె ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారన్న ఆగ్రహంతో రగిలిపోయిన ఆ యువకుడు ఇంటికి నిప్పు పెట్టడంతో, ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉండటం కలచి వేస్తుంది. తీవ్రంగా గాయపడిన నలుగురు ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news