భార్యతో పరాయి వ్యక్తి రాసలీలలు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

-

కర్నూలు జిల్లా అల్లగడ్డ పట్టణంలో అక్రమ వ్యవహారం స్థిరపైకి వచ్చింది. ప్రియుడితో రాసలీలలు జరుపుతున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టించాడు. అల్లగడ్డ పట్టణంలోని రామలక్ష్మి కొట్టాల రెండో వీధిలో ఓ ఆటో డ్రైవర్ నివాసం ఉంటున్నాడు. అతనికి ఓ సామాజిక వర్గం హక్కుల సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తో పరిచయం ఏర్పడింది.

అయితే తనకు రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉందని, మాయమాటలు చెప్పిన అతను ఆటో డ్రైవర్ భార్యతో సన్నిహితంగా మెలుగుతూ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. దీనిపై భర్తకు అనుమానం రావడంతో సదరు వ్యక్తిని తన ఇంటికి రావద్దని చెప్పాడు. అయితే అతను మాత్రం ఆమె భర్తకు తెలియకుండా వస్తూ వెళ్లేవాడు.

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భర్త ఇంట్లో లేని సమయంలో వచ్చి మహిళతో రాసలీలలు కొనసాగిస్తుండగా, ఇరువు పొరుగు వారు గమనించి ఫోన్ చేసి చెప్పారు. భర్త వచ్చి భార్య, ప్రియుడు ఇంట్లో ఉండడం గమనించి గదికి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వారిద్దరిని స్టేషన్ కు తరలించారు. మంగళవారం ఉదయం వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని బాధితుడు చెప్పారని, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version