పెట్రోల్ ట్యాంకుల్లో బంగారం.. పట్టుకున్న అధికారులు..

వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నా, జరిగిన సంఘటన అందరికీ షాకింగ్ కలిగించేలా ఉంది. అక్రమంగా బంగారాన్ని ఒక దేశం నుండి మరొక దేశానికి తరలించడం కోసం నిందితులు చేసిన ప్రయత్నం ఆశ్చర్యపరుస్తుంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కథనం ప్రకారం పెట్రోల్ ట్యాంకుల్లో అక్రమంగా బంగారం తరలించే సంఘటన ఇండో- మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో జరిగింది.

సరిహద్దు ప్రాంతం నుండి ఇండియాలోకి వస్తున్న ఈ ట్రక్కుని అడ్డగించిన అధికారులు 35కోట్ల విలువైన బంగారు కడ్డీలని స్వాధీనం చేసుకున్నారు. 66.4కిలోల బరువున్న బంగారు కడ్డీలని పెట్రోల్ ట్యాంకుల్లో ఉంచి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడ్డారు. బంగారం అక్రమంగా తరలించబడుతుందన్న అనుమానం రావడంతో సరిహద్దు ప్రాంతంలోనే అడ్డగించారు. ఈ ట్రక్కులు పంజాబ్ కి వెళ్తున్నాయట. డ్రైవర్ తో పాటు మొత్తం ఐదుమంది పోలీసులకి చిక్కారు.