ఇద్దరు ఎమ్మెల్యేల కోల్డ్ వార్ పీక్స్ కి చేరిందిగా

-

వారిద్దరూ అధికార పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలే అయిన కూడా వారిద్దరికీ ఒకరంటే ఒకరికి అసలు పడటం లేదట.. ఆ ఇద్దరి ఎమ్మెల్యేలు మధ్య కోల్డ్ వార్డ్ తారాస్థాయికి చేరింది. లోకల్ ఎన్నికలు, నామినేట్ పోస్టుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం మొదలై తాజాగా నువ్వెంతా అంటే నువ్వెంతా అనే స్థాయిలో అంతర్గత పోరు నడుస్తుంది. ఆ ఇద్దరు నేతల మధ్య లొల్లి అధిష్టానానికి తలనొప్పిగా మారిందట.. మరోవైపు ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు తో కింది స్థాయి క్యాడర్ అయోమయంలో పడ్డారట..

నల్గొండ జిల్లా లో అధికార పార్టీలో నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ల మధ్య ఉన్న విభేదాలు రోజు రోజుకు ముదిరిపోతున్నాయి.నిన్న మొన్నటి దాకా అంతర్గతంగా ఉన్న విభేదాలు కాస్త బహిర్గతం అవుతున్నాయి. వీరిద్దరూ ఒకే నియోజకవర్గానికి చెందిన వారు కావడమే గొడవకు ప్రధాన కారణం. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారగా… ఎమ్మెల్యేల ఆధిపత్య పోరుతో పార్టీ క్యాడర్ నలిగిపోతున్నారు.

కంచర్ల భూపాల్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరాడు. నల్గొండ నుంచి పోటీచేసి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై విజయం సాధించి తన సత్తా చాటాడు. 2018 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పైన పోటీచేసి కాంగ్రెస్ నుంచి రెండో సారి చిరుమర్తి లింగయ్య నకిరేకల్ ఎమ్మెల్యే గా గెలుపొంది …ఆతరువాత టీఆర్ఎస్ లో చేరాడు. ఇక్కడే మొదలయ్యింది నల్గొండ, నకిరేకల్ ఇద్దరు ఎమ్మెల్యే ల మధ్య అసలు పంచాయితీ. అంతకుముందే వేర్వేరు పార్టీలల్లో ఉన్న ఇద్దరు నేతలకు మధ్య పెద్ద ఎత్తున విభేదాలు ఉండేవి. ఇద్దరూ ఒకే పార్టీలో చేరాక…వివాదం కాస్త సద్దుమణిగింది.లోకల్ ఎన్నికలు,నామినేటెడ్ పోస్ట్ ల విషయంలో వివాదం మళ్లీ ముదిరింది.

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి స్వస్థలం నకిరేకల్ నియోజిక వర్గము కావడంతో నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల,నార్కట్ పల్లి మండలల్లో కంచర్ల కు కొంత కేడర్ ఉంది.లోకల్ ఎలక్షన్ లో తన వర్గానికి టికెట్లు ఇవ్వాలనే విషయంలో చిరుమర్తితో విబేదాలు పెట్టుకుంది కంచర్ల భూపాల్ రెడ్డి వర్గం. అయితే కంచర్ల వర్గానికి టికెట్లు ఇవ్వలేదు చిరుమర్తి లింగయ్య .అయితే తనకు రాజకీయ భవిష్యత్ లేకుండా కంచర్ల భూపాల్ రెడ్డి తోపాటు ఆయన వర్గం అడ్డుపడుతున్నారని తన ప్రత్యర్థి వేముల విరేశానికి అనుకూలం గా కంచర్ల వ్యవహరిస్తున్నారని చిరుమర్తి లింగయ్య ఆగ్రహం తో ఉన్నాడట.

నకిరేకల్ నియోజిక వర్గంలో చిట్యాల దగ్గర కంచర్ల బ్రదర్స్ కి కాటన్ మిల్ ఉంది.లోకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పత్తి కొనుగోళ్లలో టోకెన్ విధానాన్ని తీసుకొచ్చారు.చిరుమర్తి వైఖరి కంచర్ల బ్రదర్స్ కు ఆగ్రహం తెప్పించాయి.రైతు ప్రయోజనాల కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చామని చిరుమర్తి తోపాటు ఆయన వర్గం వాదన. ఎక్కడా లేని నిబంధనలు తన సొంత మిల్లుపైనే ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారంటూ చిరుమర్తిపై ఆగ్రహంతో ఉన్నారు కంచర్ల బ్రదర్స్.ఈ నేపధ్యంలో చిరుమర్తి లింగయ్య తమను వేధిస్తున్నారని నిరసనగా,కంచర్ల బ్రదర్స్ మిల్లు క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ గొడవలో పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడం,ఇద్దరు నేతలకు సర్ది చెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

రాజకీయ ప్రత్యర్థి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి చిరుమర్తి లింగయ్య తమను వేధింపులకు గురిచేస్తున్నారని కంచర్ల బ్రదర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంచర్ల బ్రదర్స్ కు సంబంధించిన మిల్లులో టోకెన్ విదానాన్ని అమలు చేయాలని, చిరుమర్తితో పాటు అదే టైంలో ఎంపీ కోమటిరెడ్డి కూడా వ్యవసాయ అధికారులతో ఒత్తిడి తేవడం వారి అనుమానాలకు బలాన్నిచ్చాయి. అంతేకాదు కోమటిరెడ్డి, చిరుమర్తి ఇద్దరూ ఒక్కటై తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటున్నారు కంచర్ల బ్రదర్స్. చివరికి నల్గొండ , నకిరేకర్ ఎమ్మెల్యే ల మధ్య పంచాయితీ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి చేరింది.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు వుంటాయని… ఇద్దరు నేతలకు సర్ది చెప్పడంతో వివాదం తాత్కాలికంగా మాత్రమే సద్దుమణిగింది.

Read more RELATED
Recommended to you

Latest news