బెంగళూరు సమీపంలో 100 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

-

అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా అవడం లేదు. తాజాగా బెంగళూరు సమీపంలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. వీటి విలువ దాదాపు రూ. 100 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా చేశారు. ఈ 100 కోట్లు విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనపరచుకున్నారు అధికారులు. బెంగళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దొరికాడు తెలంగాణ చెందిన వ్యక్తి.

తెలంగాణకు చెందిన ఈ వ్యక్తి ఇదియోపియా నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చినట్లుగా గుర్తించారు. అతని వద్ద నుండి 14 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనపరుచుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఇదియోపియా నుంచి తెచ్చిన డ్రగ్స్ ని ఢిల్లీలోని వ్యక్తికి చేరవేస్తుండగా పట్టుకున్నారు అధికారులు. పట్టుకున్న డ్రగ్స్ ని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపామని అధికారులు తెలిపారు. దీని వెనక ఎవరున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version