విజయసాయిరెడ్డి నిర్ణయంపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..!

-

విజయసాయిరెడ్డి నిర్ణయంపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం రాజకీయ నేతలకు ఫ్యాషన్ అయిపోయిందని చురకలు అంటించారు బండ్ల గణేష్‌. ఇది ధర్మమా అంటూ సోషల్ మీడియాలో బండ్ల గణేష్ పోస్టు పెట్టారు. విజయసాయిరెడ్డి నిర్ణయాన్ని తప్పుబడుతూ… బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandla Ganesh’s sensational comments on Vijayasai Reddy’s decision

ఇది ఇలా ఉండగా.. విజయసాయిరెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు విజయసాయిరెడ్డి. నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుచూ విజయసాయిరెడ్డి పిటిషన్ వేశారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరారు విజయసాయిరెడ్డి. సీబీఐ స్పందన కోసం విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version