దావోస్‌ కు వెళ్లి.. రూ.20 వేల కోట్లు స్వాహా చేశారు – బక్క జడ్సన్

-

దావోస్‌ కు వెళ్లి.. రూ.20 వేల కోట్లు స్వాహా చేశారని బాంబ్‌ పేల్చారు బక్క జడ్సన్. సీఎం రేవంత్ రెడ్డికి దావోస్‌కి పోయి తెచ్చిన పెట్టుబడులు ఐదు సంవత్సరాలలో ఇంప్లిమెంట్ చేస్తామని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రూ.10 కోట్లు పెట్టి దావోస్ పోయి అక్కడ నుండి రూ. లక్ష 70 వేల కోట్లు సూట్ కేసులో పట్టుకొని వస్తున్నాము మాకు స్వాగతం పలకండని మళ్లీ రూ.20 వేల కోట్లు స్వాహా చేశారని ఆరోపణలు చేశారు.

మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదు సంవత్సరాలలో ఈ రూ.లక్ష 70 వేల కోట్లు పెట్టుబడులు తెస్తామని నేను ఇచ్చిన ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టండని నిలదీశారు. మొత్తం మేము తెచ్చామని చెప్పుకుంటున్న 64 కంపెనీలు ఈ నాలుగు సంవత్సరాలలో పెట్టకుంటే మమ్మల్ని జైలులో పెట్టమని బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి సంతకం పెట్టాలని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ప్రజలను మేము మోసం చేయట్లేదని ఈ బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ సెక్రటరీ, ఐటీ మంత్రి అడ్వైజర్ సంతకాలు పెట్టాలని డిమాండ్‌ చేశారు బక్క జడ్సన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version