కొడుకు ప్రేమించిన అమ్మాయిని రేప్ చేసిన తండ్రి…!

-

సాధారణంగా కొడుకులు కూతుళ్ళ ప్రేమ వ్యవహారాల విషయంలో తల్లి తండ్రులు సీరియస్ గా ఉంటారు అనేది అందరికి తెలిసిందే. తాము ఎవరిని అయినా ప్రేమించినట్టు చెప్తే దాదాపుగా ఒప్పుకునే అవకాశాలు తక్కువ. ఎక్కడో విశాల మనసు ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారు. లేకపోతే ఆస్తులు అంతస్తులు చూస్తూ ఉంటారు. తల్లి ఒప్పుకుంటే తండ్రి ఒప్పుకునే అవకాశం ఉండదు.

తండ్రి ఒప్పుకుంటే తల్లి అవి ఉండాలి ఇవి ఉండాలి అని చెప్తూ ఉంటుంది. అలా జరుగుతూ ఉంటాయి తల్లి తండ్రుల వద్ద ప్రేమ వ్యవహారాలూ. అయితే తాజాగా ఒక వింత ఘటన జరిగింది. కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించా అని చెప్పగానే తండ్రి ఒప్పుకోలేదు. బ్రతకలేను అన్నాడు ఆ అమ్మాయి లేకపోతే. దీనితో తండ్రి ఘాతుకానికి ఒడిగట్టాడు. ఆ అమ్మాయికి ఇంటికి వెళ్లి మీ పెళ్లి నేను చేస్తా అన్నాడు.

ఆమె అతని మాటలు నమ్మి వెళ్ళింది. అయితే ఆ వ్యక్తి దారిలోనే ఆ అమ్మాయిని రేప్ చేసి బలవంతంగా తాళి కూడా కూడా కట్టేశాడు. తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలో జరిగిన ఈ దారుణం ఇప్పుడు సంచలనం సృష్టించింది. అతని పేరు నిత్యానందం గా పోలీసులు వివరించారు. కుమారుడు ముకేశ్‌ కన్నన్‌. ఆ యువతీ పై అత్యాచారం చేసిన అనంతరం ఆమెను స్నేహితుడి ఇంట్లో బంధించాడు.

ఇక కొడుక్కి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంది అన్నాడు. ఇక ఆ అమ్మాయిని తనతోనే కాపురం చెయ్యాలని బెదిరించాడు. పలు మార్లు అత్యాచారం కూడా చేసాడు. అతని నిర్బంధంలో ఉన్న యువతి తప్పించుకుని వేదారణ్యం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news